వినాయకలో ఉమెన్స్‌ డే అదుర్స్..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

వినాయకలో ఉమెన్స్‌ డే అదుర్స్..!
– కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైద్యులు, సిబ్బంది
– శుభాకాంక్షలు తెలిపిన యజమాన్యం, వైద్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శాంతినగర్‌ కాలనీలోని వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. శనివారం మహిళ దినోత్సవం సందర్బంగా ఆసుపత్రికి చెందిన డా.నవ్య చింత ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.

ఆసుపత్రిలోని మహిళ వైద్యులు, సిబ్బంది కేక్ కట్ చేశారు. హ్యాపీ ఉమెన్స్ డే నినాదాలతో ఉత్సహంగా గడిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎండీ డాక్టర్ చందర్, డాక్టర్ రవీందర్ నాయక్, డాక్టర్ ధనుంజయ నాయక్, డాక్టర్ వందనలు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రి నిర్వహకులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కూడా ఆసుపత్రిలోని వైద్యులకు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఇంచార్జ్ అజిజా, మేనేజర్స్ శ్రీశైలం, శ్రీకాంత్, మార్కెటింగ్ ఇంచార్జ్ సంతోష్ రాథోడ్, హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు ఇంటర్ బాలికలకు శుభవార్త..!