అట్టహాసంగా బుయ్యని బర్త్ డే..!
– దేవాలయాల్లో పూజలు నిర్వహించిన శ్రీనివాస్ రెడ్డి
– వేదమంత్రోచ్చరణలతో ఆశీర్వదించిన పండితులు
– శుభాకాంక్షలు తెలిపిన నేతలు, నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు జననేత, కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి బర్త్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సోమవారం తన జన్మదినం సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయం, కాళికాదేవి దేవాలయంలో పూజలు నిర్వహించారు. భద్రేశ్వర దేవాలయంలో శివునికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భద్రేశ్వరున్ని దర్శించుకున్నారు. అదేవిధంగా కాళికాదేవి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు, వేద పండితులు పూజలు నిర్వహించి మంత్రోచ్చరణలతో శ్రీనివాస్ రెడ్డిని ఆశీర్వదించారు. మరోవైపు భద్రేశ్వర దేవాలయంలో చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డిని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వీరశైవ, వీరశైవ యువదళ్, మహిళ మండలి సభ్యులు కూడా శ్రీనివాస్ రెడ్డిని సన్మానించి శుభకాంక్షలు తెలిపారు.
ఇదికూడా చదవండి…

