పిడుగు పడి వ్యక్తి మృతి
– పక్కనే ఉన్న ఎద్దు కన్నుమూత
– రాంపూర్ కింది తాండలో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పిడుగు పడి ఓ వ్యక్తితో పాటు ఓ ఎద్దు మృతి చెందిన సంఘటన తాండూరు మండలం రాంపూరు కింది తాండలో చోటుచేసుకుంది. తాండా వాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండాకు చెందిన మూఢవత్ రవి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం వారి పొలం వద్ద ఉన్న ఎద్దును తీసుకవచ్చేందుకు వెళ్ళాడు. మధ్యాహ్నం తరువాత భారీ వర్షం ప్రారంభం కావడంతో పొలంలోని చెట్టు కిందకు వెళ్ళాడు. పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలో పిడుగు పడింది. దీంతో రవితో పాటు పక్కన ఉన్న ఎద్దు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

