317 జీవో బాధితులకు న్యాయం చేయండి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

317 జీవో బాధితులకు న్యాయం చేయండి
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఉద్యోగుల వినతి
– సీఎం దృష్టికి తీసుకెళతామని ఎమ్మెల్యే హమి
తాండూరు, దర్శిని ప్రతినిధి : జీవో 317 ఉద్యోగ ఉపాధ్యాయ బాధితులకు న్యాయం చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని పలువురు ఉద్యోగులు కోరారు. సోమవారం తాండూరు పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాధితులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జీవో 317 జీవో ద్వారా జిల్లాలు మారడంతో మహిళా టీచర్లు ప్రతిరోజు ప్రయాణాలు చేస్తూ, అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేవధన వ్యక్తం చేశారు.

ప్రయాణాల్లో రోడ్డు ప్రమాదాల బారిన పడి అంగవైకల్యం కూడా పొందినారని గుర్తుచేశారు. 317 జీవో అనేటువంటిది ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా భస్మాసురస్త్రం లాంటిదని అన్నారు. తాండూరు నియోజకవర్గంలో నిరుద్యోగులు 250 ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వికారాబాద్ జిల్లాకు వెయ్యి మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు బలవంతంగా బదిలీ అయ్యారని తెలిపారు. కావున 317ను రద్దు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసకవెల్లి బాధితులందరికి కచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా చూస్తానని అభయం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాడిశెట్టి తిరుపతి, మల్లేశ్వరి, జెస్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అట్టహాసంగా బుయ్యని బర్త్ డే..!