మైనార్టీల సంక్షేమానికి మోడీ ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

మైనార్టీల సంక్షేమానికి మోడీ ప్రాధాన్యం
– బీజేపీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి యు.ర‌మేష్ కుమార్
– తాండూరు ప‌ట్ట‌ణ మైనార్టీ మోర్చ అధ్య‌క్షుడి నియామ‌కం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : మైనార్టీల సంక్షేమానికి ప్ర‌ధాని మోడీ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లకు ప్రాధాన్య‌మిస్తున్నార‌ని బీజేపీ వికారాబాద్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి యు.ర‌మేష్ కుమార్ అన్నారు. బుధ‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలోని పార్టీ కార్యాల‌యంలో ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు సుద‌ర్శ‌న్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో బీజేపీ మైనార్టీ మోర్చ అధ్య‌క్షుడిగా జ‌హీర్ అబ్బాస్‌ను నియ‌మించారు. ఈ సంద‌ర్భంగా యు.ర‌మేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఆయ‌న‌కు నియామ‌క‌త‌ప్రం అంద‌జేశారు. అనంత‌రం యు.ర‌మేష్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ మైనార్టీ మోర్చా పాత్ర చాలా కీలకమైంద‌న్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనార్టీల కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టడం జరిగింది అన్నారు. వాటి ఫలాలు నిరుపేద మైనార్టీ కుటుంబాలకు చేరే విధంగా కృషిచేయాల‌ని సూచించారు. అంతేకాకుండా పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, కార్యదర్శి చిదిరి ప్రకాష్, తాండూరు మండల ప్రధాన కార్యదర్శి విజయ్, బీజేవైఎం జిల్లా నాయకులు కిరణ్ ముదిరాజ్, నరేష్ , విక్కీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.