మన వశిష్టను వదిలేయము..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

మన వశిష్టను వదిలేయము..!
– వైద్య ఖర్చులకు చేయూత అందేలా చొరవ
– బాలుడి ట్రీట్‌మెంట్‌ కోసం ఆర్థిక సాయం
– ఉదారతను చాటుకున్న వ్యాపారి పటేల్ శ్రీశైలం
తాండూరు, దర్శిని ప్రతినిధి : లివర్‌ వ్యాధితో బాధపడుతున్న మాస్టర్ వశిష్టను వదిలేయకుండా కాపాడుకునేందుకు అందరు తోడ్పాటు అందించేలా చూస్తామని తాండూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి, వీరశైవ సమాజం మాజీ అధ్యక్షులు పటేల్ శ్రీశైలం కుటుంబానికి భరోసా అందించారు. యాలాల మండలం సంగెం గ్రామంలోని వీరశైవ కుటుంబానికి చెందిన శివకుమార్, భానుప్రియ దంపతుల కుమారుడు వశిష్ఠ (9నెలలు) అరుదైన కాలేయా వ్యాధి(బైలేరియా అట్రేసై)తో బాధడుతున్నాడు.

వ్యాధి నుంచి బాలుడిని కాపాడుకోవాలంటే కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు వెల్లడించగా ఇందుకు రూ. 22లక్షలు అవసరమవుతాయని తెలిపారు. పేదరికంలో ఉన్న దంపతులు అంతమొత్తంలో ఖర్చు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పటేల్ శ్రీశైలం తన కుటుంబ సభ్యులతో కలిసి బాలుడు తండ్రి శివకుమార్ కు రూ. 11వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు పెద్దలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, నాయకులు స్పందించి బాబు వైద్యం కోసం తోచినసాయం అందించాలి విజ్ఞప్తి చేశారు. బాలున్ని వదిలేయకుండా కాపాడుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.

సమాజం తరుపున వైద్య ఖర్చులకు సాయం అందించేలా చూస్తానని భరోసా అందించారు. అదేవిధంగా పటేల్ కుటుంబ సభ్యులు అందించిన సాయానికి తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, యువనాయకులు జోషి వికాస్ తదితరులు ఉన్నారు. మరోవైపు బాలుడు వైద్య ఖర్చుల కోసం పలువురు దాతలు స్పందింస్తూ తోచిన సాయం అందిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

శ్రీ సాయి మేధలో ఘనంగా హోలీ వేడుకలు