బడ్జెట్.. అబద్దపు అంకెల గారడి..!
– ఆరు గ్యారెంటీలు, సంక్షేమం ఉత్తిదే
– మహిళలు, రైతులు, నిరుద్యోగులకు మోసం
– బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో రేవంత్ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అబద్దాలు.. అంకెల గారడికి ప్రతిరూపంగా ఉందని బీఆర్ఎస్ తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూ. 3,04,965 కోట్ల బడ్జెట్లో అన్ని రంగాలను మోసం చేసే విధంగా ఉందని అన్నారు.

ఆరు గ్యారెంటీలకు పాతరవేసిందని అన్నారు. 15 నెలల పాలనలో మహిళలను, రైతులకు, నిరుదొ గులను, ఉద్యోగులను మోసం చేస్తూ అబద్ధాల పాలన చేస్తుందని ద్వజమెత్తారు. రైతులకు సక్రమంగా రుణమాఫీ చేయలేదని అన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఊసే లేదన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో స్పష్టత ఇవ్వలేదన్నారు. ఆరోగ్యానికి కేటాయింపులు లేవని, ఫించన్లకు మొండి చెయ్యి చూపిందన్నారు. బీసీలకు కులగణనలో మోసం చేసిందని ఆరోపించారు.

పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. అప్పటి ప్రభుత్వంలో ఉద్యోగాల నియమకాలకు నోటిపికేషన్లు ఇస్తే కాంగ్రస్ తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు పోతుందన్నారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో అప్పులను గత యేడాది కంటే ఈ సారి 7,527 కోట్లను ఎక్కువ చేసిందన్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని, కొత్త కష్టాలను తెచ్చే బడ్జెట్ అని విమర్శించారు. కాంగ్రెస్ బడ్జెట్ ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని అన్నారు.
ఇదికూడా చదవండి…

