బైకు ర్యాలీ సూపర్ హిట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బైకు ర్యాలీ సూపర్ హిట్..!
– ముగింపు ప్రచారం అదరహో
– గులాబీ సంద్రమైన తాండూరు
– రోహిత్ రెడ్డికి జన నీరాజనం
– ర్యాలీలో హోరెత్తించిన రోహిత్ రెడ్డి
– పాల్గొన్న హిరో మంచు మనోజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా తాండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ బైకు ర్యాలీ సూపర్ హిట్ అయ్యింది. ప్రచారం చివరి అంకాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంతో పాటు మండలాల్లో బైకు ర్యాలీ కార్యాక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మంగళవారం తాండూరు పట్టణంలో చేపట్టిన ర్యాలీని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై ప్రారంభించారు. నేతలు, కార్యకర్తలతో పాటు బైకుపై కూర్చుని ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని విలియమూన్ చౌరస్తా నుంచి ఇందిరా చౌరస్తా. నెహ్రు గంజ్. గాంధీ చౌక్, భద్రేశ్వర చౌక్, రైల్వే గేట్, తెలుగు గడ్డ, నిజాంషాహీ దర్గా, కర్బలా మైదాన్, రైల్వే గేట్, సీతారం పేట్, గాంధీనగర్, ముర్షద్ దర్గా, వీవీ హెచ్ఎస్, శివాజీ చౌక్, ఇందిరా చౌక్ మీదుగా బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది.

ర్యాలీలో టాలీవుడ్ హిరో మంచు మనోజ్ కూడ పాల్గొన్నారు. హిరో మంచు మనోజ్ తో కలిసి రోహిత్ రెడ్డి ర్యాలీలో సందడి చేశారు. ముందుగా బైకుపై కూర్చుని ర్యాలీలో ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి నీరాజనం పట్టిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు బిడ్డగా చేస్తున్న అభివృద్ధి. సంక్షేమానికి అందరు ఆదరించడం పట్ల రుణపడి ఉంటానని అన్నారు. ప్రజల అభిమానం చూస్తుంటే ఎన్నికల్లో తనకు భారీ మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

అదేవిధంగా తాండూరు పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పట్టణంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తాండూరు మొత్తం గులాబీ మయం అయ్యింది. ర్యాలీ సూపర్ హిట్ తో పార్టీలో నేతల్లో కొత్త జోష్ హోరెత్తింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!