వేసవి తాపానికి రక్ష..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ రాజకీయం లైఫ్-స్టైల్ హైదరాబాద్

వేసవి తాపానికి రక్ష..!
– తాటి ముంజలులో పోషకాలు
– అమ్మాయిలైలే అస్సలు మిస్సవ్వద్దు
దర్శిని డెస్క్ : మండు వేసవి తాపాన్ని మోసుకోస్తే.. అదే తాపం నుంచి రక్షణ పొందేందుకు ప్రకృతి తాటిముంజలను అందించింది. పోషకాలు పుష్కలంగా ఉండే తాటి ముంజలను వేసవిలో ఎక్కడపడితే అక్కడ విరివిగా విక్రయిస్తుంటారు. వేసవిలో ప్రత్యేకంగా లభించే ముంజలు తాపం నుంచి మనల్ని రక్షించడమే కాకుండా ఆమ్మాయిల ఆరోగ్యానికి ఎన్నో రెట్టు మంచి చేస్తుంది. తాటి ముంజల వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం.

వేసవిలో రోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక వరం. ముంజల్లో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వేసవిలో ముంజల్ని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను కూడా నివారించవచ్చు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ తాటి ముంజలు మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది హృదయ సంబంధ వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి ముంజలు దివ్యౌధంలా పనిచేస్తాయి. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చర్మ వ్యాధులను నివారించడంలో ముంజలు బలేగా ఉపయోగపడతాయి. ఈ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది. మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు ఉన్నవారికి చాలా మంచిది. తాటి ముంజలు తినడం వల్ల పేగు పూతల కూడా నయమవుతుంది. నాలుకపై వచ్చే అల్సర్లను తగ్గించే శక్తి వీటికి ఉంటుంది. తాటి ముంజలు చెమట బొబ్బలు, ఎండ వల్ల కలిగే ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ముంజల రసాన్ని చర్మానికి పూయడం వల్ల చెమటకాయలు త్వరగా తగ్గుతాయి. వేసవిలో అధికంగా వచ్చే మొటిమలను వదిలించుకోవడానికి, ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం వీటిని తినవచ్చు.

అంతేకాకుండా ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తాటి అదుపులో ఆంథోసైనిన్ల అనే ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి వివిధ కణితులు, రొమ్ము క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తాయి. ముంజలు పాలిచ్చే తల్లుల ఆరోగ్యానికి చాలా మంచిది. శిశువుకు మంచి పోషకాలు కూడా లభిస్తాయి. వీటిని తినడం వల్ల మహిళల్లో వచ్చే తెల్లబట్ట సమస్య తగ్గుముఖం పడుతుంది. కాబట్టి మహిళలు ముంజలు తప్పనిసరిగా తినాలి.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది

ఇదికూడా చదవండి…

బుయ్యని స్పూర్తి.. దాతల సేవా నిరతి..!