కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు

తాండూరు రాజకీయం వికారాబాద్

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు
– దళారులను ఆశ్రయించకుండా విక్రయించాలి
– కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో మార్కెట్ కమిటి చైర్మన్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తాండూరు, బషీరాబాద్, కోట్‌ పల్లి మార్కెట్ కమిటిల చైర్మన్లు పట్లోళ్ల నర్సింలు, మాధవరెడ్డి, అంజయ్యలు అన్నారు.

శనివారం తాండూరు పట్టణం డీసీఎంఎస్ కేంద్రంలో తెలంగాణ మార్క్ ఫెడ్ ద్వారా రంగారెడ్డి జిల్లా ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తాండూరు నియోజకవర్గ రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటి చైర్మన్లు పట్లోళ్ల నర్సింలు, మాధవరెడ్డి, అంజయ్యలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని అన్నారు. పంటలకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

రైతులు దళాలరులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మొక్కజొన్నను విక్రయించుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులకు మద్దతు ధర లభిస్తుందని అన్నారు. మద్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం రైతుల ఖాతాలోనే నిధులను జమ చేస్తుందని అన్నారు.

డీసీఎంఎస్ మేనేజర్ సలాం పాష మాట్లాడుతూ మొక్కజొన్నకు ప్రభుత్వం రూ. 2400ల మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి.. జొన్నలను ఎండబెట్టి కేంద్రాలకు తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ఆయా మార్కెట్ కమిటిల చైర్మన్లు నారాయణ రెడ్డి, చందర్ నాయక్, డైరెక్టర్లు ఉదయ్ భాస్కర్ రెడ్డి, జర్నప్ప, మొగులప్ప, నాయకులు వీరారెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఎజాజ్, కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ చిన్నయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ తీరు సిగ్గుచేటు