9రకాల సరకులతో రేషన్ కిట్లు..!
– త్వరలో ప్రారంభించేందుకు సన్నహాలు
– పేదోడి కడుపు నింపాలనే సన్నబియ్యం పంపిణీ
– ఏడాదిన్నర పాలనలో సర్కారు విప్లవాత్మక ఘనత
– దేశంలో ఎక్కడాలేని విధంగా అందిస్తున్న తెలంగాణ
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని పేదల కడుపు నింపేందుకు సన్నబియ్యం అందించిన కాంగ్రెస్ సర్కారు. త్వరలోనే 9రకాల రేషన్ కిట్లను అందించేందుకు సన్నాహాలు చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని రాజీవ్ కాలనీ, పాత తాండూరుతో పాటు తాండూరు మండలం చెన్ గెష్ పూర్ గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీని చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధనికులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి నిర్ణయం తీసుకుందని అన్నారు. పేదల కడుపునింపాలని ప్రభుత్వంపై భారం పడిన పంపిణి చేస్తోందని అన్నారు. దేశంలో పేదలకు సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని అన్నారు. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక ఘనతను సాధించిందని అన్నారు.

ఈ నిర్ణయంతో తాండూరు నియోజకవర్గంలో నెలకు దాదాపు 1500 మెట్రిట్ టన్నుల సన్నబియ్యంను 2లక్షల 31 వేల 260 మంది లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, తహసీల్దార్ తారాసింగ్, నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సోమ శేఖర్, తాండూరు మండల పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప, నేతలు వడ్డె శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ కుమార్, జిలాని, మండల నాయకులు జి.రాందాస్, కలాల్ రాజుగౌడ్, శ్రీశైలం గౌడ్, కురువ మల్లప్ప, రంగంపల్లి వెంకటేష్, ఏఎంసీ డైరెక్టర్లు ఉదయ్ భాస్కర్ రెడ్డి, తుల సీరాం, జర్నప్ప, జినుగుర్తి శ్రీనివాస్ గౌడ్, రేషన్ డీలర్ ఎల్లారెడ్డి, యువనాయకులు గౌడీ రాము యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ గౌడ్, పండరి, చిట్టిఘనాపూర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

