ఎర్లీబర్డ్ వచ్చేసింది..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎర్లీబర్డ్ వచ్చేసింది..!
– పట్టణ వాసులకు సువర్ణ అవకాశం
– ముందస్తు పన్నుల చెల్లింపుపై 5శాతం రాయితీ

– సద్వినియోగం చేసుకోవాలని సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలు వారి ఆస్తి పన్నులను ముందస్తుగా చెల్లిస్తే 5శాతం రాయితీ అందించేందుకు అమలు చేస్తున్న ఎర్లీబర్డ్ పథకంను ప్రభుత్వ ఆదేశాలతో తాండూరు మున్సిపల్‌లో ఈ ఏడాది కూడా అమల్లోకి తెచ్చింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నులు మార్చి నెలాఖరు వరకు ముగిసిన సంగతి తెలిసిందే. ఆస్తిపన్నుల వసూళ్లలో తాండూరు మున్సిపల్ చివరిస్థానంలో నిలవడం విచారకరం. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆస్తిపన్నులను వసూలు చేసేందుకు ఎర్లీబర్డ్ ద్వారా అవకాశం దక్కింది.

బకాయిలు పేరుకుపోకుండా ముందస్తు పన్నులను చెల్లించేందుకు ప్రజలను ప్రోత్సహించడమే ఎర్లీబర్డ్ ముఖ్య ఉద్దేశం. ఈ సారి కూడా ప్రభుత్వం మున్సిపల్‌లో ఎర్లీబర్ట్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈనెల ఆఖరు వరకు ప్రజలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు పన్నులు చెల్లించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు ఆస్తిపన్నుల మొత్తం 5శాతం రాయితీ కూడా కల్పిస్తోంది. పట్టణ ప్రజలకు ఇది సువర్ణ అవకాశం అని అధికారులు పేర్కొంటున్నారు. ముందస్తుగా ఆస్తి పన్నులు చెల్లించి 5శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎర్లీబర్డ్ పథకంపై అయినా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి సద్వినియోగం చేసుకునేందుకు యత్నిస్తారా లేదో అని ప్రజల్లో అనుమానం రేకెత్తుతోంది.

ఇదికూడా చదవండి…

ఎల్ఆర్ఎస్ పోడగింపు..!