సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి
– తాండూరు కోర్టులో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కోర్టులో సబ్ కోర్టు ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు కోర్టులోని న్యాయవాదులతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా న్యాయస్థానంలో ఉన్న ఇబ్బందులు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు కోర్టులో సబ్ కోర్టు ఏర్పాటు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని అన్నారు. ఆయన స హాకారంతో సబ్ కోర్టు ఏర్పాటయ్యేలా కృషి చేస్తానని అన్నారు. దీంతో పాటు న్యాయస్థానంలో మౌళిక సదుపాయాలు, వసతులు, నూతన భవనం ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి, చంద్రశేఖర్, ఫరీద్, గోపాల్, గుండప్ప, జాయింట్ సెక్రటరి ఆంజనేయులు, కోశాధికారి సోఫియా భేగం, స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీ జిలాని, లైబ్రరీయన్ మస్తాన్, సభ్యులు మల్లు యాదవ్, రాము గౌడ్, శ్రావణ్ కుమార్, ప్రకాష్, నరేంద్ర సింగ్, మహిళ న్యాయవాదులు అరుణ, వాణిశ్రీ, పరమేశ్వరీ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి….

భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు