గణేష్ నిమజ్జనంపై ఫోకస్..!
– రేపు మండపాల నిర్వహకులతో సమావేశం
– హాజరు కావాలన్న పట్టణ సీఐ సంతోష్‌కుమార్
తాండూరు. దర్శిని ప్రతినిధి : తాండూరులో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసు శాఖ దృష్టిసారించింది. ప్రతి యేడాది నిమజ్జనం ఉత్సవాలకు పోలీసు శాఖ పటిష్టి చర్యలు తీసుకుంటోంంది. ఈ యేడాది కూడా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రేపు మంగళవారం వినాయక మండపాల నిర్వహకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండలంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుంతుందని వెల్లడించారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి పట్టణంలోని అన్ని వినాయకుల మండపాల నిర్వహకులు తప్పక హాజరు కావాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

