గ్రంథాలయ వారోత్సవాలకు రండి
– మంత్రి సబితారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డిలకు ఆహ్వానం
– స్వయంగా ఆహ్వానించిన చైర్మన్ మురళీకృష్ణ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఈనెల 14వ తేది నుంచి ప్రారంభమయ్యే గ్రంథాలయ వారోత్సవాలకు హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్నం సునితా మహేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గాజీపూర్ మురళీకృష్ణగౌడ్ కోరారు.
శనివారం హైదరాబాదులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్రెడ్డిలను మురళీకృష్ణగౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు కొనసాగించడం జరుగుతుందని, ముగింపు గ్రంథాలయ వారోత్సవాలకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని, జెడ్పీ చైర్ పర్సన్‌లను కలిసిన వారిలో గ్రంథాలయ సంస్థ వికారాబాద్ సెక్రటరీ సురేష్ బాబు, తదితరులు ఉన్నారు.
