దేవాలయాలకు పాలక మండళ్ల ఖరారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దేవాలయాలకు పాలక మండళ్ల ఖరారు..!
– పోట్లీ మహారాజ్, నగరేశ్వర గుడులకు సభ్యుల నియామకం
– పత్రాలను అందజేసిన ఎమ్మల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రెండు దేవాలయాలకు పాలకమండళ్లు ఖరారయ్యాయి. శనివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నూతన పాలకవర్గ సభ్యులకు నియామకపత్రాలను అందజేశారు. పట్టణంలోని సద్గురు పోట్లీ మహారాజ్ దేవాలయంతో పాటు నగరేశ్వర దేవాలయానికి దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కొత్త పాలకవర్గాలను నియమించారు.

పోట్లీ మహరాజ్ దేవాలయ చైర్మన్ గా ప్రసాద్ గౌడ్, సభ్యులుగా ఎస్. రాజ్ కుమార్, ఎ. నవీన్ కుమార్, ఎ. జగన్నాథ్, ఎన్. సిద్దమ్మ, కె. శ్రీనివాస్, ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా కె. అనంత్ భట్ నియామకం అయ్యారు. అదేవిధంగా నగరేశ్వర దేవాలయ చైర్మన్ గా దాదాపురం సతీష్, సభ్యులుగా ఎ. సంతోష్ కుమార్, ఎస్. సతీష్, కె. అనిల్ కుమార్, దాదాపురం గురురాజ్, ఎస్. ఉజ్వల, ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఎన్. దామోదర్ నియామకం అయ్యారు. ఈ మేరకు తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా కొత్త సభ్యులకు నియమాకాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని కొత్త సభ్యులకు సూచించారు. తమ వంతు సహాకారం అందిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా దేవాలయ కమిటి సభ్యులుగా తమకు అవకాశం కల్పించడం పట్ల పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి….

అట్టహాసంగా రినీష్‌ రెడ్డి జన్మదినం