బీఆర్ఎస్ పేదల ప్రభుత్వం
– కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు
– ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తాండూరు పట్టణంలోని 7వ వార్డులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున ఆర్తి రెడ్డి ప్రచారం చేశారు. ప్రచారానికి వచ్చిన ఆర్తిరెడ్డికి వార్డు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్తి రెడ్డి వార్డులో అందరిని పలకరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. పేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు.
అదేవిధంగా తాండూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కష్టపడ్డారని గుర్తుచేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, మహిళ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, వార్డు ఇంచార్జ్ ఈర్షాద్, మహిళ నాయకురాలు అనిత, నిర్మల తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

