అట్టహాసంగా రినీష్ రెడ్డి జన్మదినం
– చీఫ్ విప్ నిమాసంలో సంబరాలు
– పేద పిల్లలకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిల వారసుడు పట్నం రినీష్ రెడ్డి జన్మదినం అట్టహాసంగా జరిగింది. శనివారం తాండూరు పట్టణంలోని చీఫ్ విప్ మహేందర్ రెడ్డి నివాసంలో సంబరాలు నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ యువనాయకులు బిర్కడ్ రఘు ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ అబ్దుల్ ఖవి, నాయకులు బోయరాజు, భగవాన్, శివానంద్, సిద్దు అయ్య, అంజిల్ రెడ్డి, పునీత్ కుమార్, చెన్నారం శేఖర్ తదితరులు హాజరై కేక్ కట్ చేసి రినీష్ రెడ్డికి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రినీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో పేద పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహేందర్ రెడ్డి, సునితారెడ్డిల వారుసుడుగా.. నాయకుడుగా రినీష్ రెడ్డి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో యువకులు కలిసి నడుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రినీష్ రెడ్డి యువసేన, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

