స్వామియే శరణం అయ్యప్ప
– అయ్యప్ప మాలధారణలో స్వాములు
తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వామియో శరణం అయ్యప్ప అంటూ భక్తులు శరణు గోషను మార్మోగించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పలువురు భక్తులు మాలధారణ చేసుకున్నారు. నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన 28 మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకున్నారు. గురుస్వాములు భక్తులకు అత్యంత భక్తి శ్రద్దలతో మాలధారణ చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి కఠినమైందని, స్వాములు నియమాలు పాటిస్తూ దీక్షను చేపట్టాలని గురుస్వాములు సూచించారు. దీక్షను పవిత్రంగా పూర్తి చేసిన స్వాములకు అయ్యప్ప స్వామి కృపా కటాక్షం సిద్ధిస్తుందని ఉపదేశం చేశారు.

