భద్రేశ్వరుడిపై భక్తి..!
– 14ఏండ్లుగా గజమాల సమర్పణ
– కోటం కుటుంభీకుల మొక్కుబడి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన భద్రేశ్వరుడు కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్నారు. అందుకే ప్రతి యేడాది జరిగే జాతర ఉత్సవాల్లో భక్తులు తమ కోర్కెలు తీర్చిన భద్రేశ్వరుడికి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాంటి వారిలో తాండూరుకు చెందిన కోటం వీరప్ప కుటుంబ సభ్యులు ముందు వరుసలో నిలుస్తున్నారు.

కోటం వీరప్ప కుటుంబ సభ్యులు గత 14 ఏండ్లుగా భద్రేశ్వరుడికి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి యేడాది జరిగే పల్లకి సేవకు గజమాలను సమర్పిస్తూ వస్తున్నారు. తాజాగా జరుగుతున్న జాతర ఉత్సవాలలో పల్లకి సేవకు కోటం వీరయ్య కుటుంబ సభ్యులు భద్రేశ్వరుడి వద్ద పూజలు భక్తిశ్రద్దలతో గజ మాలకు పూజలు నిర్వహించి పల్లకి సేవ రథోత్సవంకు సమర్పించారు.

ఈ సందర్భంగా కోటం వీరప్ప కుటుంబ సభ్యులు, ఆలయ కమిటి సభ్యులు కోటం సిద్ధలింగం మాట్లాడుతూ భద్రేశ్వరుడిని కోరిన కోర్కెలు తీర్చి తమ కుటుంబంపై కృప కురిపించారని అన్నారు. స్వామి దయవల్ల అభివృద్ధికి చెందుతున్నామని అన్నారు.
ఇది కూడా చదవండి….

