ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం
– తాండూరులో పరీక్షలకు కేంద్రాల ఏర్పాటు
– ఏర్పాట్లను పరీశీలించిన ఎమ్మార్వో, ఎంఈఓ
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న తెలంగాణ ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తాండూరు తహసీల్దార్ తారాసింగ్, ఎంఈఓ వెంకటయ్య గౌడ్ లు అన్నారు. శనివారం పరీక్షల కోసం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని వారు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం వారు మాట్లడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 20వ తేది నుంచి 26వ తేది వరకు పరీక్షలు కొనసాగుతాయని చెప్పారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2-30గంటల నుంచి సాయంత్రం 5-30 గంటల వరకు రెండు సెషన్స్లో పరీక్షలు జరుగుతాయన్నారు.

ఓపెన్ టెన్త్ కోసం 1 పరీక్షా కేంద్రం, ఓపెన్ ఇంటర్ కోసం 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షల సందర్భంగా అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్ వంటి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పరీక్షాల కేంద్రాలలోకి సెల్ ఫోన్ అనుమతించడం జరగదని, పరీక్షా కేంద్రాలకు దగ్గరలలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు.

ఇది కూడా చదవండి….

కన్నుల పండుగలా కలశ ధారణ