పేదల కోసమే వైద్య శిబిరాలు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పేదల కోసమే వైద్య శిబిరాలు
– వినాయక ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య సేవలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల కోసమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహకులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు.

ఆదివారం తాండూరు పట్టణం పాత తాండూరు 14వ వార్డులోని అంబేద్కర్ పార్కులో వినాయక ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వార్డు మాజీ కౌన్సిలర్ బోంబీనా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరాన్ని విఠల్ నాయక్ పరిశించాలరు. ఇందులో భాగంగా ఆసుపత్రి వైద్యులు స్థానిక పేదలకు జ్వరం, బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించారు. దాదాపు 200ల మందికి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు.

ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలు అందించడం కోసమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మాజీ కౌన్సిలర్ బోంబీనా మాట్లాడుతూ వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా. రాజు, విజయ్ కుమార్, ఆకాంక్ష, శ్రీలత, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

తాండూరు నుంచి అంతర్ రాష్ట్ర సర్వీసులు