కాంగ్రెస్ తో బతుకులు ఆగం
– బీఆర్ఎస్ తోనే పేదలకు న్యాయం
– ఇంటింటి ప్రచారంలో గులాబి సైన్యం
– ప్రతి వార్డులో ముమ్మర ప్రచారం
– తాండూరు మునిసిపాలిటీలో వేడెక్కిన రాజకీయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల బతుకులు ఆగం అవుతాయని అన్నారు. బీఆర్ఎస్ తోనే పేదల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని వార్డునెంబర్ 15లో బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మునిసిపల్ పరిధిలోని వార్డునెంబర్ 23లో బీఆర్ఎస్ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ ఇంటింటి ప్రచారం చేశారు. తాండూరును అభివృద్ది పథంలో నడిపించిన బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మునిసిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ఇంటింటి ప్రచారంతో బిఆర్ఎస్ నేతలు హోరెత్తించారు. గులాబి సైన్యం మొత్తం వార్డులలో ఇంటింటి ప్రచారం ప్రారంభించడంతో తాండూరులో ఎన్నికలు మరింత వేడెక్కాయి.
ఇదికూడా చదవండి..

