బకులావతికి నివాళులు…!

తాండూరు రాజకీయం వికారాబాద్

బకులావతికి నివాళులు…!
– దశదిన కర్మలో పాల్గొన్న నేతలు
– నివాళులు అర్పించిన చీఫ్ విప్, తాండూరు ఎమ్మెల్యే
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామానికి చెందిన ఎల్మకన్నె పీఏసీఎస్ మాజీ చైర్మన్ నారాయణ గౌడ్ సతీమణి బకులావతి దశదినకర్మ బుధవారం తాండూరు పట్టణంలోని భవానీ నగర్లో ఉన్న వారి స్వగృహంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తంరావు, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నాయకులు డా.సంపత్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ కుమార్ గౌడ్, వెంకన్న గౌడ్, రవి, పరిమళ, నేతలు రాందాస్, జినుగుర్తి శ్రీనివాస్ గౌడ్, బోయరాజు, ప్రవీణ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అజ్మత్, జర్నప్ప, పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, బందు మిత్రులు హాజరై బకులావతి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

బకులావతి కుటుంబ సభ్యులు ఉమ్మడి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ ఎస్. రవీందర్ గౌడ్, మాజీ ఎంపీపీ అనితా గౌడ్, కుమారులు మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, మనీష్ గౌడ్, పలువురును చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు వేరు వేరుగా హాజరై పరామర్శించారు.

ఇది కూడా చదవండి….

పహెల్గాం ఉగ్రదాడి హేయం..!