అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం..!
– టపాసుల దుకాణాల్లో తనిఖీలు
– నిబంధనలపై ఫైర్‌ అధికారుల ఆరా
– అనుతులున్నదుకాణాలు ఎన్నో తెలిస్తే షాక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : టపాసుల దుకాణాలలో అగ్ని ప్రమాదాలపై తాండూరు అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌ బొగ్గులకుంట హనుమాన్‌ టెక్డీలోని వ్యాపార సముదాయ ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదంను దృష్టిలో ఉంచుకుని సోమవారం తాండూరు పట్టణంలో వెలసిన టపాసుల దుకాణాలను అధికారులు సందర్శించారు. తాండూరు ఫైర్ స్టేషన్ ఇంచార్జ్ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలు, గోదాంలను తనిఖీ చేశారు.

ఆయా దుకాణాలలో వ్యాపారులు, నిర్వహకులు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అని ఆరా తీశారు. సెప్టీ నిబంధనలు పాటిస్తున్నారా లేదని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ దుకాణం వద్ద ఫైర్‌ ఎక్స్‌టెన్షనల్‌ (అగ్నిమాపక పరికరాలు) తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. వాటర్‌ బ్యారల్‌, ఇసుక బకెట్లు, నీటి బకెట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రమాదాలు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. మరోవైపు తాండూరు పట్టణంలో వెలసిన దుకాణాలలో కేవలం 13 దుకాణాలకు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా అనుమతులు పొందారని ఫైర్ ఆఫీసర్ జలంధర్ రెడ్డి తెలిపారు.

ఇదికూడా చదవండి…

డమాల్.. డేంజర్..!