నూత‌న అధ్య‌క్షుల‌ను స‌న్మానించిన ఎంపీ, ఎమ్మెల్యే

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

నూత‌న అధ్య‌క్షుల‌ను స‌న్మానించిన ఎంపీ, ఎమ్మెల్యే
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో నూత‌నంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ ప‌ట్ట‌ణ, మండ‌లాల అధ్య‌క్షులకు చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. మంగ‌ళ‌వారం తాండూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షులుగా అఫ్పూ(న‌యూం), తాండూరు మండ‌ల అధ్య‌క్షులుగా రాందాస్, పెద్దేముల్ మండ‌ల అధ్య‌క్షులుగా కోహీర్ శ్రీ‌నివాస్ యాద‌వ్, యాలాల మండల అధ్య‌క్షులుగా మ‌ల్లారెడ్డి, బషీరాబాద్ మండ‌ల అధ్య‌క్షులుగా రాములు నాయ‌క్‌ల‌ను ఎన్నుకున్న విష‌యం తెలిసిందే. తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల‌ను నూత‌న అధ్య‌క్షులు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.