కల్వ సుజాతపై ఫిర్యాదు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కల్వ సుజాతపై ఫిర్యాదు..!
– ఫేస్‌బుక్‌లో ప్రధానిపై ఫేక్ ఫోస్ట్
– చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి కంప్లైంట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్, తాండూరుకు చెందిన కల్వ సుజాతపై స్థానిక బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, పటేల్ విజయ్ కుమార్ తదితరులు ఫిర్యాదును అందజేశారు.

ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ హోదాలో ఉన్న కల్వ సుజాత ఫేస్ బుక్‌లో తన ఖాతా నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడిపై ఆయనను అగౌరవ పరిచేలా విడియోను పోస్ట్ చేశారని ఆరోపించారు. దేశ ప్రధానిపై మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేధన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రధాని మోడిని పాకిస్తాన్‌కు చెందిన ఇమ్రాన్‌ ఖాన్ ఒడిలో కూర్చున్నట్లు అవమానకరమైన రీతిలో హావాబావాలు చేస్తూ దృశ్యాలను పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశ పూర్వంగా చేసిన పోస్టును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ ప్రధానిని, దేశ ఫౌరుల మనోభావాలకు భంగం కలిగించే రీతిలో ఉన్న పోస్టును తొలగించాలని కోరారు. ప్రధానిపై ఫేక్ పోస్టు చేసిన కల్వ సుజాతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఫేస్‌ బుక్‌లో పోస్టు చేసిన వీడియో..

 

నేతలు ఆరోపించిన కల్వ సుజాత ఖాతా పోస్టు

ఇదికూడా చదవండి…

రేషన్ తీన్మార్…!