ప్రాణం తీసిన కుక్కకాటు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రాణం తీసిన కుక్కకాటు..!
– రెండు నెలల తరువాత వ్యక్తి మృతి
– పెద్దేముల్ ఇందూరులో విషాధం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కుక్క కాటు వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రెండు నెలల తరువాత చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో విషాధం నింపింది. గ్రామస్తులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని ఇందూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీలో యువనాయకుడుగా కొనసాగుతున్నాడు. అయితే రెండు నెలల క్రితం ప్రవీణ్ కుక్క కాటుకు గురయ్యాడు. చికిత్స పొందడంలో కాస్త అలసత్వం చేసినట్లు తెలిసింది. ఇటీవల వర్షాల వల్ల వాతావరణంలో మార్పులు రావడంతో ప్రవీణ్ అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. తాజాగా సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందూతూ ప్రవీణ్ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా ప్రవీణ్ గ్రామంలో చాల చురుకుగా ఉండే వాడని, కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయంగా కూడా ఎదుగుతున్నాడని గ్రామస్తులు గుర్తుచేశారు. ఆయన మరణం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

అక్రమ రవాణాకు.. ‘చెక్’..!