కొంప ముంచిన నిద్ర మత్తు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కొంప ముంచిన నిద్ర మత్తు..!
– కల్వర్టును ఢీకొట్టి లారీ పల్టీ
– యాలాల మండలంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : కమ్ముకొచ్చిన నిద్రమత్తు కొంపముంచింది. వేగంగా నడుపుతున్న లారీ అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి పల్టీ పడింది. ఈ సంఘటన సోమవారం యాలాల మండలం పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్త కోట నుంచి చెరుకులోడు ఖాళీ చేసిన లారీ సోమవారం తెల్లవారు జామున తాండూరు వైపు వస్తోంది. ఉదయం 4-30గంటల ప్రాంతంలో మార్గమద్యలోని లక్ష్మీనారాయణ పూర్ సమీపంలోకి రాగానే డ్రైవర్‌కు నిద్రమత్తు ఆవహిచింది. కునుకు వేసేలోపే లారీ అదుపుతప్పి కల్వర్టు పైకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన డ్రైవర్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. లారీ కల్వర్టు పై నుంచి ఫల్టీ కొట్టింది. ఈ విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదానికి కారణమైన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

ఇదికూడా చదవండి…

ఇరుముడి ప్రియనే.. అయ్యప్పా..!