తాండూరు సుస్థిర అభివృద్ధే ధ్యేయం
– పట్టణ ప్రగతికి ప్రత్యేక ప్రణాళికలు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– రూ.2.21కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సుస్థిర అభివృద్ధే ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం విలియమూన్ చౌరస్తా నుంచి రాయల్ కాంట వరకు రూ. 21లక్షలతో చేపడుతున్న భారీ డ్రైన్ పనులతో పాటు పట్టణంలోని ఆదర్శ నగర్ వినాయక కన్వెన్షన్ హాల్ నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి వరకు రూ. 2కోట్లతో చేపట్టే సైడ్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు పట్టణంలో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే తాండూరు పట్టణంలో చిలుకవాగు కాలువ, కాగ్నానది నుంచి కొత్త పైపులైన్, అమృత్ 2.0 కింద వీలీన కాలనీల్లో తాగునీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. తాండూరు సుస్థిర అభివృద్ధే ధ్యేయమని, పట్టణ ప్రగతికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయడం జరగుగుతుందన్నారు.
అభివృద్ధి, సంక్షేమంపై సమీక్ష
మరోవైపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి. సంక్షేమ పథకాల అమలుపై అధికారులు, నాయకులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గృహజ్యోతి కింద 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, రూ.500లకు సబ్సీడీ గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, అమృత్ 2.0 పథకాలపై చర్చించారు. అనంతరం పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.

అదేవి ధంగా ఈ సమావేశంలో నేతలు తాండూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైడ్ డ్రైన్ నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందించి నిర్మాణం చేయిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత. తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, మమత, రాము, కాళికాదేవి దేవాలయ చైర్మన్ బస్వరాజ్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, బంటు మల్లప్ప, బాతుల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాల, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ కుమార్, బంటు వేణుగోపాల్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి. ఏఈ ఖాజా హుస్సేన్, నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

