లగచర్ల రైతులకు రూ. 1కోటి 15లక్షల పరిహారం

తాండూరు రాజకీయం వికారాబాద్

లగచర్ల రైతులకు రూ. 1కోటి 15లక్షల పరిహారం
– చెక్కులు అందజేసిన సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
– 44 మంది రైతులకు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో చేపడుతున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు(ఎంపీఐపీ) కోసం భూమి అందించిన లగచర్ల రైతులకు రూ. 1కోటి 15లక్షల 55వేల 154ల పరిహారం అందించారు.

గురువారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ చేతుల మీదుగా భూములు కోల్పోయిన 44 మంది రైతులకు పరిహారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక పార్కు కోసం భూములు కోల్పోయిన హకీంపేట్ రైతులకు అందించిన పరిహారాన్ని సద్వినియోగం చేసుకొ వాలని సూచించారు. త్వరలోనే ఇండస్ట్రీయల్ పార్కు భూ సేవకరణ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు సుస్థిర అభివృద్ధే ధ్యేయం