షేక్ ఇసాక్‌ పాష కుటుంబానికి అండ‌గా ఉంటాం

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

షేక్ ఇసాక్‌ పాష కుటుంబానికి అండ‌గా ఉంటాం
– చేవేళ్ల ఎంపీ గ‌డ్డం రంజిత్‌రెడ్డి భ‌రోసా
– ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో క‌లిసి ప‌రామ‌ర్శ
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: వాగులో గ‌ల్లంతై మృతి చెందిన పులుసుమామిడి గ్రామ పంచాయ‌తీ వార్డు స‌భ్యులు షేక్ ఇసాక్ పాష కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని చేవేళ్ల పార్ల‌మెంట్ స‌భ్యులు గ‌డ్డం రంజిత్‌రెడ్డి హామి ఇచ్చారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో క‌లిసి ఎంపీ రంజిత్‌రెడ్డి పులుసుమామిడిలోని షేక్ పాష కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. పాష భార్య స‌మీనా భేగాన్ని ఓదార్చి.. పాష క‌వ‌ల పిల్ల‌ల‌ను ఎత్తుకున్నారు. ఎలాంటి సంద‌ర్భాల్లోనూ ఆధైర్య ప‌డొద్ద‌ని.. ఎళ్ల‌ప్పుడూ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని ఎంపీ రంజిత్‌రెడ్డి భ‌రోసా క‌ల్పించారు. పిల్ల‌ల‌ను జాగ్ర‌త్తగా చూసుకోవాల‌ని ధైర్యం చెప్పారు. అనంత‌రం రంజిత్‌రెడ్డి ఫౌండేష‌న్ తరుపున బాధిత కుటుంబానికి రూ. 1ల‌క్ష ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేశారు.