అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోండి
– తాండూరు సబ్ కలెక్టర్కు బీజేపీ నేతల వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ బీజేపీ నేతలు కోరారు. మంగళవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ను బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు.

పట్టణంలోని కాగ్నా నది నుంచి ఇసుకాసురులు రాత్రి, పగలు తేడా లేకుండా వందల సంఖ్యల ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే వారిని ఎవరికి ఏం చెప్పుకుంటారో.. చేసుకోండని బెదిరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా తాండూరులో కాగ్నా నది నుంచి అక్రమ ఇసుక రవాణా జరగకుండా ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ను వినతిపత్రం ద్వారా కోరారు.

ఇందుకు సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, మాజీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్, ఉపాధ్యక్షులు మంతటి రాజు, తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

