తాండూరులో గంజాయి పట్టివేత

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో గంజాయి పట్టివేత
– సుమారు 1 కిలోన్నర స్వాదీనం
– దర్యాప్తు జరుపుతున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని తాండూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. ప్రాథమిక సమాచారం |మేరకు తాండూరు పట్టణం ముర్షద్ దర్గా ప్రాంతానికి చెందిన రఫీక్ అనే యువకుడు గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

ఈ మేరకు బుధవారం తాండూరు పట్టణం విలియమూన్ స్కూల్ సమీపంలో నిందితుడు రఫీక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 1కిలోన్నర గంజాయి ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు ప్యాకెట్లను స్వాదీనం చేసుకుని పోలీస్టేషన్ కు తరలించారు.

ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నిందితుడు కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకవచ్చి ఇక్కడ విక్రయాలు చేపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమగ్ర దర్యాప్తు జరిపిన తరువాత పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

దళిత రైతులకు దన్ను..!