నిఘా నీడలో గ్రూప్-3 పరీక్షలు
– గంటన్నర ముందే కేంద్రంలోకి అనుమతి
– తాండూరులో 11 పరీక్షా కేంద్రాలు
– అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్
– సమీక్షించిన సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు, ఎల్లుండి తాండూరులో నిర్వహిస్తున్న గ్రూప్ 3 పరీక్షలకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. భద్రతా చర్యలతో పాటు నిఘా నీడలో పరీక్షలు కొనసాగనున్నాయి. గ్రూప్-3 పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో మొత్తం 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని సెంట్ మార్క్స్, సెంట్ మార్క్స్ జూబ్లీ స్కూల్, సెంట్ మేరీ స్కూల్, పీపుల్స్ డీగ్రీ కాలేజీ, గంగోత్రి విద్యాలయ, భాష్యం జూనియర్ కాలేజీ, శాలివాహన డీగ్రీ కాలేజీ, చైతన్య జూనియర్ కాలేజీ. సింధూ జూనియర్ కాలేజీ, సిద్దార్థ జూనియర్ కాలేజీ, సింధూ డీగ్రీ కాలేజీలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గ్రూప్ -3 పరీక్షలలో మొదటి రోజు పరీక్ష మొత్తం రెండు సెషన్స్ లలో, రెండో రోజు పరీక్ష ఒకే సెషన్ లో నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటలకు ఒక పేపర్, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో పేపర్ నిర్వహిస్తుండగా రెండో రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు జరగనుంది. అయితే పరీక్ష రాసే అభ్యర్థులను ఉదయం గంటన్నర ముందే పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించనున్నారు. గ్రూప్-3 పరీక్షల సందర్భంగా తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ చీప్ సూపరింటెండెంట్. రూట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్స్ తో సమీక్ష నిర్వహించారు.
కేంద్రాలలో నిఘా వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలన్నారు. కేంద్రాలలో విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పక్కాగా అమలు చె యాలన్నారు. అభ్యర్థులు ఎలాంటి మాల్ ప్రాక్టీసుకు పాల్పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. అధికారులు, నిర్వహకులు సమన్వయంతో పరీక్షలు ప్రశాంతగా జరిగేలా చూడాలన్నారు.
ఇదికూడా చదవండి…

