జంతువు మెదడుతో పాఠం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

జంతువు మెదడుతో పాఠం..!
– ఆవుదే అని చెప్పిందన్న విద్యార్థులు
– ఆగ్రహించిన నేతలు, హిందూ సంఘాలు
– పాఠశాల వద్ద బైటాయించి ఆందోళన
– టీచర్ ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్
– యాలాల బాలికల జెడ్పీ హైస్కూల్లో ఉద్రిక్తత
తాండూరు, దర్శిని ప్రతినిధి : జంతువుకు చెందిన మెదడు భాగం ప్రదర్శిస్తూ పాఠం చెప్పిన ఓ టీచర్ సంఘాల ఆగ్రహానికి గురైంది. మెదడు ఆవుదే అని చెప్పిందని విద్యార్థులు చెప్పడంతో హిందూ సంఘాలు పాఠశాల వద్దకు వచ్చి బైటాయించారు. పాఠం చెప్పిన టీచర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన యాలాల మండల కేంద్రంలోని పాఠశాలలో ఉద్రిక్తతను రేపింది.

వివరాల్లోకి వెళితే.. యాలాల బాలికల జెడ్పీ పాఠశాలలో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్న ఖాశీం బీ మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు నియంత్రణ అనే పాఠ్యంశంలో భాగంగా మెదడు పనితీరుపై బోధన చేశారు. ఓ జంతువుకు చెందిన మెదడును తరగతి గదిలో ప్రదర్శిస్తూ పాఠం చెప్పింది. అయితే విద్యార్థులు ఈ మెదడు ఏ జంతువుది అని అడగడంతో మొదట సమాధానం చెప్పలేని టీచర్ ఖాశీంబీ తరువాత ఆవు మెదడు అని చెప్పినట్లు విద్యార్థులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న బీజేపీ, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ సంఘాలు గురువారం ఉదయమే పాఠశాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. హిందూవులు గోమాతగా పూజించే అవు మెదడుతో పాఠం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠం చెప్పిన టీచర్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. విషయం తెలుసుకున్న తాండూరు రూరల్ సీఐ నగేష్ యాలాల ఎస్ఐ గిరి, పోలీసులతో కలిసి పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఆందోళన కారులను సముదాయించే ప్రయత్నం చేశారు. మెదడుతో పాఠం చెప్పిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని స్కూల్ హెచ్ఎం, జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
kvcs

ఆవు మొదడు కాదు : టీచర్
మరోవైపు జరిగిన సంఘటనపై సైన్స్ టీచర్ ఖాశీంబీ విద్యాధికారికి వివరణ ఇచ్చారు. మెదడు అనే అంశంపై విద్యార్థులకు తెలిపేందుకు గొర్రెకు చెందిన మెదడు తీసుకరావడం జరిగిందని తెలిపారు. దానిని స్టాఫ్ రూం వద్ద ఉన్న కిటికీలో ఉంచానని, దానిని గమనించిన హిందీ టీచర్. తెలుగు, ఇంగ్లీష్ టీచర్లు పదే పదే ఆవు మెదడు తెచ్చావా అని విసిగించడంతో చిరాకులో ఆవుదే అని చెప్పానని వివరించారు. ఈ వివాదంపై జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందని పాఠశాల హెచ్ఎం మల్లమ్మ తెలిపారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో గంజాయి పట్టివేత