ఎమ్మెల్సీకి శుభాకాంక్ష‌లు తెలిపిన యాలాల మండ‌ల నాయ‌కులు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ఎమ్మెల్సీకి శుభాకాంక్ష‌లు తెలిపిన యాలాల మండ‌ల నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డికి తాండూరు నియోజ‌క‌వ‌ర్గం యాలాల మండ‌ల టీఆర్ఎస్ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. గురువారం హైద‌రాబాద్‌లో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రిగాయి. యాలాల మండ‌లంకు
చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు, మాజీ ఎంపీపీ క‌ర‌ణం పురుషోత్తంరావు, మండ‌ల పార్టీ అధ్య‌క్షులు మ‌ల్లారెడ్డి, మార్కెట్ క‌మిటి మాజీ వైస్ చైర్మ‌న్ అనంత‌య్య ముదిరాజ్, పీఏసీఎస్ మాజీ చైర్మ‌న్ సిద్రాల శ్రీ‌నివాస్‌లు ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డికి పుష్ప‌గుచ్చం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో చెన్నారం మాజీ స‌ర్పంచ్ శివ‌కుమార్, యువ‌నాయ‌కులు శ‌ర‌ణు త‌దిత‌రులు ఉన్నారు.