గుట్కా నిల్వలపై దాడులు

క్రైం తాండూరు వికారాబాద్

గుట్కా నిల్వలపై దాడులు
– కిరాణా షాపుల్లో పోలీసుల తనిఖీలు
పెద్దెముల్, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ నిషేధిత గుట్కాలు, పొగాకు నిల్వలపై పోలీసులు దాడులు నిర్వహించారు. శనివారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ట్రైనింగ్ ఎస్ఐ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కిరాణా దుకాణాలు, పాన్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. పెండ్యాల శ్రీనివాస్ కిరణ్ షాప్ లో భారీ ఎత్తున నిషేధిత ప్లాస్టిక్ కవర్లు. ఆరిఫ్ పాన్ షాప్ లో 3 నిషేధిత గుట్కా ప్యాకెట్లను గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన పొగాకు ప్యాకెట్లను ఎవరైనా విక్రయిస్తే సంబంధిత వ్యక్తుల పై కేసు నమోదు చేసి రిమాండ్ పంపిస్తామని హెచ్చరించారు. ఎవరైనా నిషేధిత గుట్కా చేసినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మల్లేశం. కానిస్టేబుల్స్ వెంకట్ రామ్ రెడ్డి, రవి, రాజు, ప్రవీణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.