తాండూరులో ఏకాదశి శోభ..!
– దేవాయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు
– పాండురంగా స్వామి వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో తొలి ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, దర్శనాలు చేసుకున్నారు.

ప్రతి యేడాది మాదిరిగానే పాండురంగస్వామి దేవాలయంలో రుక్మీణీ, విఠల్ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పాత తాండూరులోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వార్లకు అభిషేకం, పూజలు నిర్వహించారు. దీంతో పాటు తాండూరు మండలంలోని అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తొలి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో భజన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు పట్టణ ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు, ఆధ్యాత్మిక గురువులు దేవాయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి పూజలతో ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.

ఇదికూడా చదవండి…

