పదిలో సత్తా చాటాలి
– బీసీ సంఘం నాయకులు
– విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం బీసీ సంఘం యువనాయకుల ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాలతో పాటు పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. కందనెల్లిలో బీసీ సంఘం జిల్లా మహిళ అధ్యక్షురాలు, వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి అందజేయగా తాండూరు పట్టణంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకూర్ తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజ్, యువ నాయకులు రాము ముదిరాజ్, అంపల్లి జగన్, జుంటుపల్లి వెంకట్, శివ, స్వేరోస్ పరమేష్, సాయి, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

