బనకచర్ల ద్రోహంపై పోరాడుదాం
– విద్యార్థులు నీటి హక్కులపై ఉద్యమించాలి
– బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణకు దక్కాల్సిన బనకచర్ల నీటి ద్రోహంపై అందరు పోరాడాల్సిన అవసరముందని తాండూరు బీఆర్ఎస్వీ నాయకులు అన్నారు.

మంగళవారం తాండూరు పట్టణంలోని శాలివాహన డిగ్రీ కాలేజీలో బీఆర్ఎస్వీ వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ కోట్ల మహిపాల్, జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, నియోజకవర్గ అధ్యక్షులు జోగుల ఎబినేజర్, పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి, భానులు విద్యార్థులకు కరపత్రాలు పంచి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణకు గోదావరి జిలాల నుంచి దక్కాల్సిన నీటి హక్కులపై ద్రోహం జరుగుతోందని అన్నారు.

ఢిల్లీ వేధికగా హైలెవల్ కమిటికి అంగీకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన సంతకం ఇప్పుడు రైతుల పాలిట మరణశాసనంగా మారిందని అన్నారు. కండ్లముందు గోదావరి పారుతున్న నీళ్లు రైతుల పొలాకు మల్లించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్ కు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు చీకటి ఒప్పందం వల్ల తెలంగాణకు ముప్పు ఏర్పడుతోందని అన్నారు. జల దోపిడిపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న పోరాటను ఎండగట్టేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలన్నారు. బనకచర్ల ఉద్యమానికి సిద్దమవుదామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో బీఆఎస్వీ నాయకులు వినోద్ కుమార్, శ్రీధర్, ఫయాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

