విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– సీఎం కప్ పోటీ విజేతలకు బహుతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు క్రీడల్లో రాణించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ స్కూల్లో నిర్వహించిన సీఎం కప్ పోటీలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. పలు పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.
అంతకుముందు ఉదయం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిలతో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవి ందర్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు అబ్దుల్ రవూఫ్. మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, బంటు వేణు గోపాల్, చంద్రశేఖర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు నాగప్ప, మహిళ నాయకులు శోభారాణి, గాజుల మాధవి, నేతలు, పలు పాఠశాలల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

