విద్యార్థులందరికి మెరుగైన వైద్యం
– ఆరోగ్యంగా ఉన్నారు.. ఆందోళన చెందొద్దు
– ప్రతిపక్షాల రాజకీయ రాద్ధాంతం తగదు
– హాస్టల్ వార్డెన్, నిర్వహకులపై వేటు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– కలెక్టర్‌తో కలిసి వసతిగృహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : గిరిజన వసతిగృహా విద్యార్థులందరికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని.. ఎవ్వరు ఆందోళన చెందాల్సిన పనిలేదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణం సాయిపూర్ లోని గిరిజన వసతిగృహ విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో క లిసి వసతి గృహాన్ని సందర్శించారు. హాస్టల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. మిగతా విద్యార్థులతో కలిసి జరిగిన సంఘటనపై ఆడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అందరు క్షేమంగా ఉన్నారని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులందరికి ప్రత్యేక వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. మూడు రోజులుగా స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. హాస్టల్లో జరిగిన సంఘటన బాధాకరం అని అన్నారు. దీనిని ప్రతిపక్షాలు రాజకీయ స్వలాభం కోసం రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి సలహాలు, సూచనలు అందించాలి కాని రాజకీయం చేయడం పద్ధతి కాదన్నారు. అదేవిధంగా పిల్లలను ఆసుపత్రికి తరలిస్తే భయాందోళన చెందుతారనే ఉద్దేశంతో వసతి గృహంలోనే ఉంచి వైద్యం అందించడం జరుగుతుందన్నారు.
పిల్లలందరు దేవుళ్లతో సమానమని, విద్యార్థుల ఆరోగ్యాల పట్ల, సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు. నాణ్యమైన భోజనం, విద్యతో పాటు కాస్మోటిక్, మెస్ చార్జీలు పెంచి సంక్షేమానికి తోడ్పడుతందని అన్నారు. మరోవైపు వసతిగృహంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్, వంట నిర్వహాకులను సస్పెండ్ చేసి వేటు వేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ వసతి గృహంలో ఆహారంను పరీక్షలకు పంపించడం జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం హాస్టల్లో నీటిని పరీక్షలు జరిపిస్తున్నామన్నారు.
వసతి గృహంలో గ్యాస్ సమస్య వల్ల పిల్లలు అనారోగ్యానికి గురైనట్లు ప్రాథమిక అనుమానంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, నాయకులు అబ్దుల్ రవూఫ్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, వెంకన్న గౌడ్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

