వినాయకుడిపై ముస్లిం యువకుడి భక్తి

తాండూరు రాజకీయం వికారాబాద్

వినాయకుడిపై ముస్లిం యువకుడి భక్తి
– గణేష్ విగ్రహానికి రూ. 11 వేల విరాళం
– మత సామరస్యతను చాటుకున్న ఎజాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయకుడి ఓ ముస్లిం యువనాయకుడు భక్తిని చాటుకున్నారు. వినాయక మండపంలో ప్రతిష్టించిన గణనాథునికి విరాళం అందించాడు. వివరాలాలు ఇలా ఉన్నాయి.

తాండూరు పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ప్రతి యేడాది వినాయకుడికి ప్రతిష్టిస్తున్నాడు. అదే ప్రాంతంలోని 25వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ యువనాయకుడు ఎజాజ్ వినాయక చవితి ఉత్సవాలపై అభిమానం చాటుకున్నారు.
kvcs
శివాజీ చౌరస్తాలో ప్రతిష్టించిన వి నాయకుడిని దర్శించుకుని విగ్రహానికి తన వంతుగా రూ. 11 వేల నగదును విరాళంగా అందజేశారు. హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్ చేతుల మీదుగా మండప నిర్వహకులకు అందజేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో ఎజాజ్ మత సామరస్యతను చాటుకోవడం పట్ల పలువురు అతన్ని అభినందించారు.

ఇదికూడా చదవండి…

ఆపరేషన్‌.. జిల్లా ఆసుపత్రి…!