వస్తున్నాయ్.. అతి భారీ వర్షాలు..!
– నాలుగు జిల్లాకు రెడ్ అలెర్ట్
– మరిన్ని జిల్లాలకు అరెంజ్ అలెర్ట్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు, రేపు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు.

రాష్ట్రంలోని నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.

ఈ ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఐదు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఇదికూడా చదవండి…

