కమలంకు ఏసీఆర్ గుడ్‌బై..!
– బీజేపీకి రాజీనామ చేసిన ఏ.చంద్రశేఖర్
– రాష్ట్ర అధ్యక్షునికి రిజైన్ లెటర్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : కమలం పార్టీ వికారాబాద్ జిల్లా నాయకులు, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ రావు గుడ్ బై చెప్పారు. చంద్రశేఖర్ 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత భాజపాలో చేరారు. భాజపాకు చంద్రశేఖర్ గతకొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారబోతున్నట్లు ప్రచారం సాగింది. దీంతో పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించినా ఫలితం లేకపోయింది. చివరకు పార్టీని వీడాలని నిర్ణయించుకుని పార్టీకి రాజీనామా చేశారు. అయితే పార్టీలో పనిచేసేవారిని ప్రోత్సహించడం లేదని ఆయన ఆరోపించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. మరోవైపు బీజేపీని వీడిన ఏసీఆర్ త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి..

