ముల్లంగి తింటున్నారా..!
– అయితే ఇవి తెలుసుకోవాల్సిందే
– మరిచి తిన్నారంటే.. మటాషే..
దర్శిని డెస్క్ : అనేక పోషకాలు ఉన్న ముల్లంగిని ఇంట్రెస్ట్‌గా తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యం కోసం కొన్ని విషయాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముల్లంగిని కొంత మంది తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపితే మరికొంత మంది మాత్రం అస్సలే ముల్లంగి తినరు. దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి జాగ్రత్తలు పాటంచాలని చెబుతున్నారు.

ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఐరన్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ రోజూ ముల్లంగి తినడం వలన ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి , మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అయితే చాలా వరకు ముల్లంగిని ఫైల్స్ సమస్య ఉన్నవారు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఇక దీనిని కొందరు కర్రీ చేసుకొని తింటే మరికొంత మంది సలాడ్ రూపంలో, ఇంకొందరు పచ్చిగా తీసుకుంటారు.

ఇలా తింటే ప్రమాదకరం
కొన్ని రకాల పదార్థాలతో ముల్లంగిని తీసుకోవడం చాలా హానికరం అంటున్నారు నిపుణులు. కాకరకాయ, ముల్లంగి అస్సలే కలిపి తీసుకోకూడదంట. వీటిని కలిపి తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, ఇది చాలా విషపూరితం అంటున్నారు నిపుణులు. అదే విధంగా తేనె , ముల్లంగి కూడా కలిపి తీసుకోకూడదంట. ఈరెండింటిని కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, కొన్ని సార్లు ప్రాణనష్టం కూడా జరిగే ఛాన్స్ ఉంటదంట. అందుకే వీలైనంత వరకు ఈ రెండింటికి దూరం ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన వెంటనే ముల్లంగి తింటే అది చాలా హానికరం అంట. అందుకే ముల్లంగి తిన్న తర్వాత దాదాపు రెండు గంటల తర్వాతే పాలు తాగాలంట.

ఇదికూడా చదవండి…

