సోషల్ మీడియా యూజర్లు జాగ్రత్త..!

క్రైం జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

సోషల్ మీడియా యూజర్లు జాగ్రత్త..!
– పొరపాటుతో ఈ తప్పులు చేస్తే జైలుకే
– ముఖ్య నియమాలను గుర్తించుకోండి
దర్శిని డెస్క్‌: ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరువాత సోషల్ మీడియాలో యూట్యూబ్, వాట్సాఫ్‌, ఇన్‌స్ట్రా గ్రామ్, ట్విట్టర్‌ వంటి ఎన్నో వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులంతా సోషల్ మీడియాను తెగ ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రపంచం మారుమూలలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో.. నిమిషాల్లో అందరికీ ఇట్టే తెలిసిపోతుంది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని నియమాలు కూడా తెలుసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే సోషల్ మీడియా వాడకం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఏమాత్రం పొరపాటు చేసినా జైల్లో ఊచలు లెక్కించాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అందుకే సోషల్ మీడీయా వినియోగంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలు తెలియక ఏదైనా తప్పు చేస్తే నేరంగా పరిగణించడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఏదైనా అనుచిత కార్యకలాపాలు చేస్తే.. అది నేరం పరిధిలోకి రావచ్చు. అంతేకాదు.. ఇలా చేసినందుకు జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. ఇంకా వినియోగ దారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన నియామల గురించి తెలుసుకోవాలి.

అభ్యంతరకరమైన పోస్టులు పెడితే
పొరపాటున కూడా అభ్యంతకరమైన వీడియోలను షేర్ చేయకూడదు. అది నేరంగా పరిగణిస్తారు. అభ్యంతరకర వీడియోలను షేర్ చేయడం చట్టరిత్యా నేరం. ద్వేషం, వివక్ష, రెచ్చగొట్టే వీడియోలను అస్సలు షేర్ చేయొద్దు. ఏదైనా మతాన్ని కించపరుస్తూ కామెంట్, పోస్ట్ పెడితే..? ఇలాంటి విషయాల్లో మొదట ఐటీ చట్టం కింద కేసు పెడతారు. ఆ తరువాత మతానికి సంబంధించిన అంశం గనక 295 సెక్షన్ పెడతారు. ఒక వేళ ఇలాంటి విషయాల్లో అవతలి వారి పరువుకు భంగం కలిగితే సెక్షన్ 499 కింద కేసు పెడతారు.

పిల్లల అశ్లీల చిత్రాలు చూస్తే.. పోస్టు చేస్తే
సోషల్ మీడియాలో పిల్లల అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తే చైల్డ్ పోర్నోగ్రఫీ చట్టం ప్రకారం చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇది చాలా కఠినంగా ఉంటుంది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు మీ కంట పడితే.. వాటిని అస్సలు చూడొద్దు. అంతేకాదు.. దానికి సంబంధించి ఎలాంటి సెర్చింగ్ చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం. ఒకవేళ అలా సెర్చ్ చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.

ఫేక్ న్యూస్ ప్రచారం..
తప్పుడు వార్తలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు ఏదైనా ఫేక్ న్యూస్ మీకు కనిపిస్తే.. దానిని షేర్ చేయకూడదు. తప్పుడు వార్తలను షేర్ చేస్తే మీపై కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా వార్తలను షేర్ చేసే ముందు క్రాస్ చెక్ చేసుకోవాలి.