‘మాజీ’ల భేటీ.. పోలిటికల్ మజా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

‘మాజీ’ల భేటీ.. పోలిటికల్ మజా..!
– నారాయణరావుతో పైలెట్ మంతనాలు
– చర్చనీయాంశంమైన పరిణామాలు
– మహారాజుల మద్దతు ఎటువైపో అనేదానిపై ఆసక్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల భేటీ.. పోలిటికల్ మజా అంటే రుచిచూపిస్తోంది. ఒకరు కాంగ్రెస్, మరోకరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఒక్క చోట కనిపించడం రాజకీవర్గాలలో చర్చకు దారితీసింది.

వారిద్దరిలో ఒకరు నారాయణ రావు, మరొకరు పైలెట్ రోహిత్ రెడ్డి గమనార్హం. సుదీర్ఘకాలం తరువాత తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చారు. వచ్చిరాగానే తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కోట్‌పల్లి మండలాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీలు, మాజీ సర్పంచులతో సమావేశం నిర్వహించారు. అచ్చంగా ఈ సమావేశం స్థానిక ఎన్నికలలో ఎలా గెలవాలనే అంశాలపై సాగింది.
kvcs
ఇదిలా ఉండగా కొద్ది సేపటి తరువాత మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సొంత మండలం అయిన బషీరాబాద్‌కు వెళ్లారు. బషీరాబాద్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు నివాసానికి చేరుకున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత రాజకీయాలపై ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, బాబాయి శ్రీశైల్ రెడ్డిలు కూడా మాజీ ఎమ్మెల్యే నారాయణవుతో భేటి అయిన సంగతి తెలిసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహారాజుల మద్దతు ఎలాంటి టర్నింగ్ తీసుకుంటుందే వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి….

పులకించిన సాయిపూర్..!