ఆర్పీలు వర్సెస్ అంగన్ వాడీలు
– పోష కాహార పంపిణీలో లొల్లి
– తాళాలు ఇవ్వకపోవడంతో పడిగాపులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో మున్సిపల్ ఆర్పీలు, అంగన్ వాడిల మద్య చిచ్చు వాతావరణం ఏర్పడింది. పోషకాహార పంపిణీ ఆదేశాలు ఇద్దరి మద్య తంటాలు పెట్టింది. అంగన్ వాడి తాళం ఇవ్వకపోవడంతో ఆర్పీలు, అంగన్ వాడీ హెల్పర్ కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. వివరాల్లోకి వెళితే.. డిమాండ్ల సాధన కోసం పక్షం రోజులుకు పైగా అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అంగన్ వాడీ సెంటర్ల ద్వారా పోష కాహార పంపిణీ సృంభించి పోయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఆర్బీలకు ఆదేశాలు జారీ చేసింది. అంగన్ వాడి కేంద్రాల్లో పోషకార పంపిణీ చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తాండూరు మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా, మేనేజర్ నరేందర్ రెడ్డిలు ఆర్పీలకు ఆదేశాలు జారీ చేసింది. శనివారం మున్సిపల్ ఆర్పీలు 1వ వార్డు మల్ రెడ్డిపల్లిలోని అంగన్ వాడి కేంద్రానికి చేరుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న అంగన్ వాడి హెల్పర్ కార్యాలయ తాళాలు తెరిచేందుకు నిరాకరించారు. దీంతో ఆర్ఫీలు అందరు మున్సిపల్ అధికారులకు, అంగన్ వాడీ సూపర్ వైజర్ కు సమాచారం అందించారు. అంగన్ వాడీ సూపర్ వైజర్ కార్యాలయానికి చేరుకుని హెల్పర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పోషకార పంపీణీ కోసం వచ్చిన ఆర్బీలు ఉదయం నుంచి దాదాపు సాయంత్రం వరకు అంగన్ వాడి కేంద్రం వద్ద పడిగాపులు కాశారు.
ఉదయం నుంచి ఆర్పీలు వర్సెస్ అంగన్ వాడీలు అనే విధంగా సమయం గడిచింది. ఈ సంఘటన తాండూరులో చర్చనీయాంశంగా మారింది. అయితే మరో అంగన్ వాడి కేంద్రంలో పోషకాహారం పంపిణీకి కౌన్సిలర్ ద్వారా సమ్మతం లభిచండంతో అక్కడ నుంచి పోషకాహారం పంపిణీకి చర్యలు తీసుకుంటామని అంగన్ వాడీ సూపర్ వైజర్ తెలిపారు.
ఇది కూడా చదవండి…

